- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు అలర్ట్..శ్రీవారి ఫిబ్రవరి కోటా టోకెన్లు, ఎప్పుడంటే?
తిరుమల శ్రీవారి ఫిబ్రవరి కోటా టోకెన్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఆన్లైన్ ఆర్జిత సేవా డిప్

దిశ, వెబ్ డెస్క్: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ తిరుమల శ్రీవారి ఫిబ్రవరి కోటా టోకెన్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఆన్లైన్ ఆర్జిత సేవా డిప్ ( Online Earned Service Dip) టికెట్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటల సమయం వరకు ఈ సేవ కోసం నమోదు చేసుకోవచ్చు. నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చ్‌వల్ సేవా కార్యక్రమాల టికెట్లు విడుదల చేయనున్నారు.
ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం ఉంటుంది. అదే రోజున ఉదయం 11 గంటలకు తిరుమల శ్రీవాణి ట్రస్ట్ దర్శనం కోటా టికెట్స్ విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల ఉచిత దర్శనానికి టికెట్లు రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ల కోటా ప్రారంభమవుతుంది. అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా రిలీజ్ చేస్తుంది టీటీడీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం టిటిడి పాలకమండలి అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ఫాలో కావాలని వెల్లడించింది.






