తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవాణి టికెట్ల టైమింగ్స్ లో భారీ మార్పులు!

by velandi.Saikiran |

తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవాణి టికెట్ల ( Srivaani Tickets) దర్శన సమయాలలో భారీ మార్పులు

తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవాణి  టికెట్ల టైమింగ్స్ లో భారీ మార్పులు!
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవాణి టికెట్ల ( Srivaani Tickets) దర్శన సమయాలలో భారీ మార్పులు చోటు చేసుకున్నారు. ఈ మేరకు టీటీడీ పాలక మండలి ( TTD) కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవాణి టికెట్ల దర్శన సమయాలలో మార్పు చేసినట్లు టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి ( Venkaiah Chowdary ) పేర్కొన్నారు.

ఇక నుంచి టికెట్ తీసుకున్న రోజే దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. తిరుమలలో ఉదయం 10 గంటలకు ఎనిమిది వందలు అలాగే రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం ఏడు గంటలకు 200 టికెట్లు ఇస్తారని... స్పష్టం చేశారు టీటీడీ ఏఈఓ వెంకయ్య. అదే రోజు... సాయంత్రం ఏడు గంటలకు వైకుంఠ న్యూ కాంప్లెక్స్ 1 నుంచి దర్శనానికి అనుమతిస్తారని స్పష్టం చేశారు. అంతేకాదు ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధన అమలులోకి వస్తుందని ఈ సందర్భంగా టిటిడి ఏ ఈ ఓ వెంకయ్య చౌదరి వెల్లడించారు.

Next Story