- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి 24 గంటలు
by Jakkula.Mamatha |
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

X
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల(Tirumala) కొండకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో తిరుమల కొండపై కొన్నిసార్లు భక్తుల(Devotees) రద్దీ అధికంగా లేదా సాధారణంగా ఉంటుంది. ఈ తరుణంలో గత రెండు వారాలుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నేడు(సోమవారం)తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు శిలాతోరణం బయట వరకు వేచి ఉన్నారు. నిన్న(ఆదివారం) శ్రీవారిని 80,193 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,298 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.43 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
Next Story






