ఏపీ ప్ర‌జ‌ల‌కు అలర్ట్...ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వ‌ర్షాలు

by velandi.Saikiran |

ద్రోణి ప్రభావంతో విశాఖ, అనకాపల్లి,కాకినాడ, కోనసీమ,అన్నమయ్య,చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉంది.

ఏపీ ప్ర‌జ‌ల‌కు అలర్ట్...ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వ‌ర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఏపీలో ప్ర‌స్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రతి రోజు చాలా ప్రాంతాలలో 40కి పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే ఈ క్రమంలో కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ద్రోణి ప్రభావంతో విశాఖపట్నం, అనకా పల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలకు అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది.

ఏపీలోని ఈ జిల్లాలలో దంచి కొట్టనున్న ఎండలు

శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, రాయలసీమ జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. నేడు విజయనగరం జిల్లా బాడంగి, వంగర, తెర్లాం మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయ‌ని తెలిపారు. మన్యం (జి) బలిజిపేట, గరుగుబిల్లి, జియ్యమ్మ వలస, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, పోలవరం (జి) చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు (జి) కుక్కునూరు,వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ స్ప‌ష్టం చేశారు. అత్య‌వ‌స‌రమైతే త‌ప్ప బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని వెల్ల‌డించారు.

Next Story