విద్యార్థులకు అలర్ట్.. రేపే పాలిసెట్ ‘కీ’ విడుదల, ఫలితాలు ఎప్పుడంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-01 02:59:05  IST  )

ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(పాలిసెట్‌-2025) నిన్న(ఏప్రిల్ 30)న జరిగింది.

విద్యార్థులకు అలర్ట్.. రేపే పాలిసెట్ ‘కీ’ విడుదల, ఫలితాలు ఎప్పుడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(పాలిసెట్‌-2025) నిన్న(ఏప్రిల్ 30)న జరిగింది. రాష్ట్రం(Andhra Pradesh)లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలల్లోని డిప్లొమా సీట్లను పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్‌(Polycet 2025) పరీక్షకు 89 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా 1,39,749 మంది పరీక్ష రాశారు. ఈ పాలిసెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని రేపు(శుక్రవారం) విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నెల(మే) 10వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://polycetap.nic.in/Default.aspx ను సందర్శించండి.

Next Story