- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులకు అలర్ట్.. తిరుమల శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
by Jakkula.Mamatha |
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

X
దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో శ్రావణ మంగళవారం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో నేడు(మంగళవారం) శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(సోమవారం) శ్రీవారిని 77,044 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,478 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.5.44 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. గత నెల(జూన్)లో సాధారణం కంటే అధికంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల(జూలై)లో సాధారణ రోజుల్లో సైతం భక్తుల రద్దీ ఉంటోంది.
Next Story






