- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala News:భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్నిసార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో శనివారం కావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల కొండకు పోటెత్తారు. ఈ తరుణంలో నేడు(శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు కంపార్ట్‌మెంట్లు దాటి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 70,217 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,155 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.84కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.






