భక్తులకు అలర్ట్.. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద చిరుత దాడి

by Naga Rani Yarlagadda |

తిరుమలలోని అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతదాడిలో ఒక జింక మృతి చెందింది.

భక్తులకు అలర్ట్.. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద చిరుత దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలకు వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది హెచ్చరించారు. బుధవారం తెల్లవారుజాము సమయంలో అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత కదలికలను గమనించినట్లు పలువురు భక్తులు విజిలెన్స్ సిబ్బందికి తెలిపారు. సీసీటీవీలోనూ చిరుత సంచార దృశ్యాలు నమోదైనట్లు తెలుస్తోంది. ఒక జింకపై దాడి చేసి హతమార్చినట్లుగా కూడా గుర్తించారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని, చిరుత కనిపిస్తే వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. చిరుత సంచారంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Next Story