అభ్యర్థులకు అలర్ట్.. FRO మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-13 10:08:17  IST  )

ఏపీపీఎస్సీ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది.

అభ్యర్థులకు అలర్ట్.. FRO మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీపీఎస్సీ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. రాష్ట్రం(Andhra Pradesh)లో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు మెయిన్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 2న క్వాలిఫైయింగ్ టెస్ట్, జూన్ 3న ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2, జూన్ 4న ఉదయం పేపర్-3, మధ్యాహ్నం పేపర్-4 పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలకు వారం రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో https://portal-psc.ap.gov.in/Default హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని ఏపీపీఎస్సీ పేర్కొంది.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (APPSC) ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ స్క్రీనింగ్‌ పరీక్షను మార్చి 16న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 15,308 అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగా.. 7,620 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి గత ఏడాది 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇక, ఈ పోస్టులను ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, నడక, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

Next Story