- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. APPSC కీలక ప్రకటన
గ్రూప్–2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది

దిశ,వెబ్‌డెస్క్: గ్రూప్–2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల (ఏప్రిల్) 10వ తేదీ నుంచి విజయవాడ(Vijayawada)లోని APPSC కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్(Certificate Verification) తేదీలను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కోటా, గ్రూప్-1 పరీక్షలు రాయబోయే అభ్యర్థులు మినహా మిగిలిన గ్రూప్-2 (Group-2)అభ్యర్థులకు ఏప్రిల్ 21వ తేదీ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ క్రమంలో విజయవాడ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది.
అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను చెక్ చేసుకోవడానికి https://portal-psc.ap.gov.in/ ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇదిలా ఉంటే.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వచ్చే నెల(మే) 3 నుంచి 9వ తేదీ వరకు ఏపీపీఎస్సీ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్ 1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షలకు హాజరయ్యే గ్రూప్ 2 అభ్యర్థులకు మే 12 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది.






