తిరుపతిలో హల్‌చల్ చేసిన మందుబాబుకు రిమాండ్‌.. సిబ్బందిపై టీటీడీ చర్యలు

by Naga Rani Yarlagadda |

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ గోపురం పైకి ఎక్కి హల్చల్ చేసిన మందుబాబుకు కోర్టు రిమాండ్ విధించింది.

తిరుపతిలో హల్‌చల్ చేసిన మందుబాబుకు రిమాండ్‌.. సిబ్బందిపై టీటీడీ చర్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ గోపురం పైకి ఎక్కి హల్చల్ చేసిన మందుబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. స్వామివారికి ఏకాంతసేవ ముగిసిన తర్వాత ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆలయంలోకి ప్రవేశించాడు. విజిలెన్స్ సిబ్బంది అతన్ని గుర్తించేలోగానే మహాద్వారం లోపలున్న ఆలయ గోపురం ఎక్కి.. కలశాలను లాగేందుకు యత్నించారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది గోపురం ఎక్కి అతడిని కిందికి దింపారు. తనకు మందు ఇస్తేనే కిందికి వస్తానని, లేదంటే రానని చెప్పడంతో వారు అవాక్కయ్యారు. ఈ ఘటనతో ఆలయంలో భద్రతా వైఫల్యం బయటపడింది.

నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. గోవిందరాజస్వామి ఆలయంలో కలకలం సృష్టించిన వ్యక్తిని నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిగా గుర్తించారు. కుటుంబంతో గొడవపడి వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. మరోవైపు ఆలయ భద్రత నిర్లక్ష్యంపై టీటీడీ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

Next Story