జనసేన పార్టీ కార్యాలయంలో మందు పార్టీలు..! వైరల్

by Ramesh Naini |

జనసేన పార్టీ కార్యాలయంలో మందు పార్టీ కలకలం రేపుతోంది.

జనసేన పార్టీ కార్యాలయంలో మందు పార్టీలు..! వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన పార్టీ కార్యాలయంలో మందు పార్టీ కలకలం రేపుతోంది. నర్సీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో మద్యం సేవించినట్లు ఆరోపణలతో బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. పార్టీ ఆఫీస్ లోపల కూర్చుని మద్యం సేవిస్తున్నట్లు కనిపిస్తున్న వ్యక్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సూర్య చంద్ర అని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు.

వైరల్ అయిన విజువల్స్‌లో చైర్‌లో కూర్చుని టేబుల్‌పై సిగరేట్, రెండు మందు గ్లాసుల దృశ్యాలు కన్పిస్తున్నాయి. అతని ఎదురుగా కూర్చున్న మరో వ్యక్తి ఈ వ్యవహారం అంతా వీడియో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై జనసేన పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాన్ని ‘దేవాలయం’గా భావించే తాము, కార్యాలయంలో ఈ తరహా వ్యవహారాలు అసహ్యకరమని నాయకులు విమర్శిస్తున్నారు.

ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని పార్టీ హైకమాండ్‌ను కోరుతూ పలువురు స్థానిక జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని, వీడియో లో కనిపించే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు కోరుతున్నారు. అయితే, ఈ ఆరోపణలపై సూర్య చంద్ర లేదా పార్టీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Next Story