Akividu: ఆకివీడు దాడి కుట్ర.. ఆ ఐపీఎస్‌పై రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణ

by Kema Shiva Kumar |

ఆకివీడు రామాలయం వద్ద దాడికి కుట్ర ఘటనపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు.

Akividu: ఆకివీడు దాడి కుట్ర.. ఆ ఐపీఎస్‌పై రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణ
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామనవమి పర్యటనలో తనపై జరిగిన దాడి యత్నం వెనుక భారీ కుట్ర ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghuramakrishnaraju) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘర్షణలకు మాజీ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) సూత్రధారి అని ఆయన పేర్కొనడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ఆయన కొన్ని కీలక పేర్లను బయటపెట్టారు. ఆకివీడు (Akividu)లో హింసను ప్రేరేపించడంలో ఇస్మాయిల్, రాజేష్ ఖన్నా, మీసాలరాజు అనే ముగ్గురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. ఘర్షణలు జరుగుతున్న సమయంలో ఈ ముగ్గురు నిందితులు పీవీ సునీల్ కుమార్‌కు ఫోన్ కాల్స్ చేసినట్లు రఘురామ పేర్కొన్నారు.

హింసకు పురగొల్పిన ఆ ముగ్గురు టెలిఫోన్ డేటా విశ్లేషిస్తే నిందితుల చిట్టా అంతా బయటపడుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. టెక్నికల్ ఆధారాలతో ఎవరూ తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు. కాగా, ఆకివీడు పెద్దపేటలోని పురాతన రామాలయాన్ని పునర్నిర్మించాలని రఘురామకృష్ణరాజు సంకల్పించారు. అయితే, ఆ స్థలంలో ‘గొంతెమ్మ’ దేవాలయం కట్టాలని కోరుతూ దళిత సంఘాలు నిరసనకు దిగాయి. శ్రీరామనవమి రోజున రఘురామ ఆలయ సందర్శనకు వెళ్లినప్పుడు రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి రాళ్ల దాడి జరిగింది. ఈ క్రమంలో తనను అంతం చేసేందుకే కొందరు కత్తులు, రాళ్లతో దాడికి దిగారని రఘురామ ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఘటనను హోంమంత్రి అనిత (Anitha), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. రఘురామ చేసిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు ఫోన్ కాల్ డేటాపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

Next Story