- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం
విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. 10 వేల ఉద్యోగాలు కల్పించేలా ఏఎన్ఎస్ఆర్ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. 10 వేల ఉద్యోగాలు కల్పించేలా ఏఎన్ఎస్ఆర్ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. జీసీసీ, ఐటీ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన తమ లక్ష్యం అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో లోకేష్ పోస్ట్ పెట్టారు. దేశంలో పేరెన్నికగన్న దిగ్గజ బీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించినట్టు తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ లాంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా పిలుపునిచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అని అభిప్రాయపడ్డారు. మరో ఆరు నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కాబోతుందని చెప్పారు. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.






