- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడివాడలో మెగా అభిమానుల ఆందోళన...పలువురు అరెస్ట్
మెగాస్టార్ చిరంజీవిపై మాజీమంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మెగాస్టార్ అభిమానులు ఆందోళనకు దిగారు.

దిశ, డైనమిక్ బ్యూరో : మెగాస్టార్ చిరంజీవిపై మాజీమంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మెగాస్టార్ అభిమానులు ఆందోళనకు దిగారు. గుడివాడలో చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్ నేతృత్వంలో మెగా అభిమానులు ఆందోన చేపట్టారు. డౌన్ డౌన్ కొడాలి నాని... జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీని విజయవాడ వన్ వే రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మెగా అభిమానులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీమంత్రి కొడాలి నాని మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమను అడ్డుకోవడం సరికాదని పోలీసులతో మెగా అభిమానులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువురు మధ్య భారీ తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, జనసేన పార్టీ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్ తోపాటు పలువురు అభిమానులను అరెస్ట్ చేశారు.






