VIDEO: ఏపీలో అఘోరా పూజల కలకలం.. బయటకు వచ్చిన షాకింగ్ వీడియో

by Ajay Maddhiboyina |

ఏపీలో అఘోర పూజల కలకలం రేగింది. గుంటూరు జిల్లా గోరంట్లలో అఘోరా పూజలు చేసినట్టు ఓ వీడియో బయటకు వచ్చింది. జనసంచారం ఉండే ప్రాంతంలో స్వామీజీలు అఘోర పూజలు చేశారంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

VIDEO: ఏపీలో అఘోరా పూజల కలకలం.. బయటకు వచ్చిన షాకింగ్ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో అఘోర పూజల కలకలం రేగింది. గుంటూరు జిల్లా గోరంట్లలో అఘోరా పూజలు చేసినట్టు ఓ వీడియో బయటకు వచ్చింది. జనసంచారం ఉండే ప్రాంతంలో స్వామీజీలు అఘోర పూజలు చేశారంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో జిల్లాలో వాట్సాప్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. అసలు ఈ పూజలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పూజలకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రాలేదు. దీంతో ఎవరికి నచ్చినట్టు వారు కథలు అల్లుతూ ప్రచారం చేస్తున్నారు. video

Next Story