YS Jagan : రావాలి జగన్​..! ఆహ్వాన పత్రిక పంపిన ప్రభుత్వం..

by Thanuru Gopichand |

అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానాకి రావాలంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్​జగన్​కు ప్రభుత్వం ఆహ్వాన పత్రిక పంపింది

YS Jagan : రావాలి జగన్​..! ఆహ్వాన పత్రిక పంపిన ప్రభుత్వం..
X

దిశ, డైనమిక్​ బ్యూరో : అమరావతి (Amaravathi) పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానాకి రావాలంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్​జగన్​కు ప్రభుత్వం ఆహ్వాన పత్రిక (Invitation)పంపింది. ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా తాడేపల్లిలోని (Tadepalli)జగన్ నివాసానికి వెళ్లారు. అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. జగన్​ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు. మఖ్యమైన కార్యక్రమానికి అన్ని పార్టీలు భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా అమరావతి ప్రారంభోత్సవానికి చంద్రబాబు ప్రభుత్వం ఆహ్వానం పంపించినా జగన్ మాత్రం రాలేదు. అయితే రేపటి కార్యక్రమానికి జగన్ వస్తారా రారా అనే విషయం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

గత తెలుగుదేశం (TDP)ప్రభుత్వంలో పురుడు పోసుకున్న అమరావతి రాజధానిపై వైఎస్​జగన్ ​ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం వహించారు. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం దానికి మళ్లీ ఊపిరులూదుతోంది. గతంలో మూడు రాజధానులంటూ గళం వినిపించిన వైసీపీ అధికారం కోల్పోయిన తర్వత తన స్వరాన్ని మార్చుకుంది. అమరావతి రాజధానిపై (Rajadhani) అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలలుగా అమరావతిపై వైసీపీ నేతలు మౌనంగా ఉంటున్నారు. దీంతో జగన్​మనసులో ఏం ఉందనేది చర్చనీయాంశం అయింది. ఇప్పుడు అమరావతి పున:నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ప్రధాని మోదీని పిలిచి మళ్లీ పనులను ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలకు ఆహ్వానం పంపుతోంది. ఈ క్రమంలోనే జగన్​కు కూడా ఆహ్వానాన్ని పంపింది. ఈ కార్యక్రమానికి జగన్​వెళతారా.. లేదా తన తరఫున ప్రతినిధిని పంపిస్తారా అనేది వేచి చూడాలి.

Next Story