వరద తగ్గిన తర్వాత.. చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం ఫోకస్!

by Geesa Chandu |   (  Updated:2024-09-03 15:19:29  IST  )

ఏపీలోని చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ లోని అనేక ప్రాంతాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి.

వరద తగ్గిన తర్వాత.. చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం ఫోకస్!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ లోని అనేక ప్రాంతాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. అయితే, వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. విజయవాడ లోని అనేక ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం.. ఇతర ప్రాంతాలలో ఉన్న మున్సిపాలిటీల నుంచి అధికారులను రప్పించారు ఏపీ మంత్రి మంత్రి నారాయణ. వీరిలో 63 మందిని పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరే కాకుండా.. సుమారుగా 4 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను నగరానికి రప్పిస్తోంది.

విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో.. మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ..." వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీం ఎంతో కష్టపడి బాధితులను రక్షించారు. ఇంకా బాధితులందరికి ఆహారం అందేలా.. మంగళవారం ఒక్కరోజే 8.5 లక్షల అల్పాహార ప్యాకెట్లు, ఇవే కాక 8.5 లక్షల ఆహార ప్యాకెట్లు, 5 లక్షల వాటర్ బాటిల్స్ కూడా పంపిణీ చేసినట్లు తెలిపారు. వరద తగ్గిన తర్వాత ముంపు ప్రాంతాల్లో.. సాధారణ స్థితిని నెలకొల్పేందుకు 10 వేల మంది కార్మికులు అవసరం అన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలకు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ కొరకు కమిషనర్లకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించామని, వరద నీరు తగ్గగానే ట్యాంకర్లతో రోడ్లను శుభ్రం చేసి, మురుగును తొలగించేలా ఫైర్ డిపార్ట్మెంట్ కు బాధ్యతలను అప్పగించామని మంత్రి తెలిపారు. తర్వాత బ్లీచింగ్, ఫాగింగ్ పనులు చేపట్టి వైద్యారోగ్య శాఖతో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాము" అని ఏపీ మంత్రి నారాయణ వెల్లడించారు.

Next Story