- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Deputy CM:ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకే చంద్రబాబు ప్రోత్సాహం: పవన్ కళ్యాణ్
సీఎం చంద్రబాబు ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు.

దిశ,వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చెప్పారు. అందుకే గ్రీన్ కో ప్రతినిధులు సరైన ప్రణాళికతో రాగానే అనుమతులు ఇచ్చారన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో విస్తరించిన పిన్నాపురం ప్రాజెక్టుకు 2,800 ఎకరాలు ఇవ్వగా కొంత భూమి పై రెవెన్యూ, అటవీ శాఖ మధ్య వివాదం వచ్చిందని పేర్కొన్నారు. దీన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని విన్నవించామని తెలిపారు. ప్రధాని మోడీ విజన్ క్లీన్ ఎనర్జీ. ఇన్ని వేల కోట్ల పెట్టుబడితో వీరు చేపట్టిన ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో విదేశాల విద్యుత్ సమస్యలు పరిష్కరించేలా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది.
పిన్నాపురం ప్రాజెక్ట్ లో ఇప్పటికే 10 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకో 24 కోట్లు పెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాక శరవేగంగా పూర్తి చేశారు. ఇక్కడ కొన్ని అటవీ భూముల ఆక్రమణలు జరిగాయనే ఆరోపణలు వస్తే పరిశీలించేందుకు రావడం జరిగింది. సీఎస్‌ఆర్ ద్వారా ఇప్పటికే గ్రీన్ కో వారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ పాలిటెక్నిక్, గోకులాల అభివృద్ధి, రైతులకు ఆర్గానిక్ వ్యవసాయం, ఉపాధి కల్పనలో సహకరించాలని కోరుతున్నాను.భవిష్యత్తులో ఈ గ్రీన్ కో ప్రాజెక్ట్ మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఉపయోగాల గురించి తెలుసుకున్న తర్వాత వారిని చిన్న అంశాల కోసం ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, శాఖల మధ్య ఉన్న సమస్య పరిష్కరించేలా కృషి చేస్తాం. కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాను.
అటవీ, రెవెన్యూ శాఖల మధ్య 45 హెక్టార్ల మధ్య సమస్య ఉంది. ఈ సమస్య పరిష్కరించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు పరిశీలించేందుకు వచ్చాను. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చూసిన తర్వాత, దీని ఉపయోగాలు తెలుసుకున్న తర్వాత చాలా గొప్పగా, ప్రపంచ స్థాయిలో అనిపించింది.ఇలాంటి రాళ్ల గుట్టల మధ్య ఇంత అద్భుతమైన ప్రాజెక్టు నిర్మించడం గర్వకారణం. ఈ ప్రాజెక్టు దాదాపు 43 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల విద్యుత్ అందించగలిగే సామర్థ్యం ఉన్న పెద్ద ప్రాజెక్ట్ ఇది . పారిశ్రామిక రంగానికి సహకరించడానికి చిత్తశుద్ధితో ఉన్నాం, ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు వారు కూడా ప్రభుత్వానికి సహకరించాలి.






