చంద్రబాబు తర్వాత లోకేషే మా నాయకుడు.. మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

కడప పసుపుమయం అయిపోయింది.

చంద్రబాబు తర్వాత లోకేషే మా నాయకుడు.. మంత్రి  పార్థసారథి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కడప పసుపుమయం అయిపోయింది. ఎటు చూసినా పచ్చని తోరణాలు, పసుపు జెండాలే దర్శమిస్తున్నాయి. టీడీపీ (TDP) నాయకులు, కార్యకర్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు (Mahaanadu) ఇవాళ కడప వేదికగా ప్రారంభం కాబోతోంది. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతోన్న తొలి మహానాడును మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కడపకు క్యూ కట్టారు.

మూడు రోజుల పాటు కొనసాగే మహానాడుకు సుమారు 5 లక్షల మంది హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పార్థసారథి (Minister Parthasarathy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాభివృద్ధిపై మహానాడులో చర్చిస్తామని అన్నారు. లోకేష్‌ (Lokesh)కు పూర్తిగా పార్టీ పగ్గాలు అప్పగించడపై వేచి చూడాల్సిందేనని తెలిపారు. చంద్రబాబు (Chandrababu) తర్వాత లోకేషే తమ నాయకుడని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు మేలు చేసేలా మహానాడులో చర్చ ఉంటుందని అన్నారు. మహానాడుకు వచ్చే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.

Next Story