ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు... ఆర్మీపై చులకన వ్యాఖ్యలు చేశారని ఆరోపణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-09 09:26:02  IST  )

భారత ఆర్మీపై చులకన వ్యాఖ్యలు చేశారంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అడ్వకేట్ మేడా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు... ఆర్మీపై చులకన వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
X

దిశ, వెబ్ డెస్క్: భారత ఆర్మీ(Indian Army)పై చులకన వ్యాఖ్యలు చేశారంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Director Ram Gopal Varma)పై అడ్వకేట్ మేడా శ్రీనివాస్(Advocate Meda Srinivas) ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌(Rajahmundry Three Town Police Station, East Godavari District)లో ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. భారత ఆర్మీపై చులకనగా మాట్లాడుతున్నారని, మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ఆర్జీవీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అడ్వకేట్ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. ఆర్జీవీపై అందించిన సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు. అనంతరం కేసు నమోదుపై నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. కులాల మధ్య చిచ్చుపెట్టేలా సినిమాలు చిత్రీకరించారని, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), ఆయన కుమారుడు లోకేశ్‌(Lokesh)పై వ్యంగ్యంగా సీన్లు చేశారని ఆయనపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఆర్జీవీ ఉన్నారు. తాజాగా ఆర్జీవీపై మరో ఫిర్యాదు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story