- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా..?.. రేపటి నుంచే ప్రత్యేక రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్స్
సంక్రాంతి ప్రత్యేక రైళ్లకు ఆదివారం నుంచి అడ్వాన్స్ బుకింగ్ జరగనున్నాయి..

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి(Sankranti)కి ఊరేళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే(Sourth Central Railway) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రైళ్ల అడ్వాన్స్ బుకింగ్స్(Advance Bookings)ను రేపటి నుంచి ఓపెన్ చేయనుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచే ఈ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవతాయని రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూంచింది. ఈ రైళ్లలో ప్రయాణించాలంటే ముందస్తు బుకింగ్స్ చేసుకోవాలని పిలుపునిచ్చింది.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతిని పెద్ద పండుగగా పిలుచుకుంటున్నారు. ఈ పండగ చేసుకునేందుకు దేశంలో ఉన్న ఏపీ వాళ్లంతా సొంతూళ్లకు వెళతారు. ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఉపాధి కోసం వలసవెళ్లారు. వీరంతా సంక్రాంతికి కచ్చితంగా వారి స్వగ్రామాలకు వెళతారు. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు, బస్సులు ఏపీ వాసులతో ఫుల్ అయిపోతాయి.
ఈ నేపథ్యంలో రైల్వే, ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి భారీగా ఆంధ్రాకు ప్రయాణాలు జరుగుతాయి. దీంతో ప్రత్యేకంగా అదనంగా రైళ్లు, ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక రైల్వే శాఖ సైతం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు టికెట్ అడ్వాన్స్ బుక్సింగ్‌కు సర్వంసిద్ధం చేసింది.






