- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజమండ్రిలో కల్తీ పాల కలకలం.. నలుగురు మృతి
రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగిన చిన్నారులు, వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురై పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరో నలుగురు మృతిచెందారు.

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి (Rajahmundry) నగరంలో కల్తీ పాలు కలకలం సృష్టించాయి. కల్తీ పాలు తాగిన కారణంగా రెండు కాలనీల ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడి నలుగురు మృతిచెందడం భయాందోళనలకు గురిచేస్తోంది. నగర పరిధిలోని చౌడేశ్వరి నగర్ (Chowdeshwari Nagar), వెంకటేశ్వర నగర్ (Venkateshwara Nagar) ప్రాంతాల్లో ఇవాళ ఉదయం పాలు తాగిన కొద్దిసేపటికే చాలామంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధితులు విలవిలలాడారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఒక్కొక్కరిగా అనారోగ్యం బారిన పడటంతో పరిస్థితి విషమంగా మారింది. ఈ మేరకు అస్వస్థతకు గురైన బాధితులను కుటుంబ సభ్యులు వెంటనే రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వారాంతా కిడ్నీ సమస్యలతో బాధపడుతుండగా వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అందులో ఇప్పటికే వరకు నలుగురు మృతి చెందినట్లుగా తెలుతస్తోంది. మరోవైపు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. పాలలో ఏదైనా రసాయనం కలిసిందా లేక పాడైపోయిన పాలను విక్రయించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రంగంలోకి ఫుడ్ సేఫ్టీ అధికారులు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ (Food Safety) అధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో విక్రయించిన పాల నమూనాలను (Samples) సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. అదేవిధంగా రెండు కాలనీల్లో పాలను విక్రయిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






