కల్తీ పాల ఘటన.. 15కు చేరిన మృతుల సంఖ్య

by Ramesh Naini |

కల్తీ పాల ఘటనలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందడంతో, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 15 కు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కల్తీ పాల ఘటన.. 15కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనకు సంబంధించి తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందడంతో, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 15 కు చేరింది. తాజాగా నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతలక్ష్మీ (55) అనే మహిళ మృతి చెందారు. గత నెల 16న కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన అనంతలక్ష్మీ.. మృత్యువుతో పోరాడుతూ తాజాగా తుదిశ్వాస విడిచారు. ఈ కల్తీ పాల ఘటనలో ఇంకా ఆరుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరు నెలల చిన్నారి, రెండేళ్ల బాలుడు ఉన్నారు. కాగా, నరసాపురానికి చెందిన అడ్డాల గణేశ్వరరావు అనే వ్యక్తి నిర్వహించే 'వరలక్ష్మి మిల్క్ సెంటర్' నుండి పాలు కొనుగోలు చేసిన సుమారు 20 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. పాలలో అత్యంత విషపూరితమైన 'ఇథిలీన్ గ్లైకాల్' (Ethylene Glycol) కలవడం వల్లే బాధితుల కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఫోరెన్సిక్ నిపుణుల నివేదికలు ధృవీకరించాయి.

Next Story