- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్తీ నెయ్యి కేసు : అజయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలన విషయాలు
కల్తీ నెయ్యి కేసులో అరెస్టైన అజయ్ కుమార్ (Ajay Kumar) సుగంధ్ రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలన విషయాలను

దిశ, వెబ్ డెస్క్ : కల్తీ నెయ్యి కేసులో అరెస్టైన అజయ్ కుమార్ (Ajay Kumar) సుగంధ్ రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలన విషయాలను ప్రస్తావించింది. తిరుమలలో లడ్డూ (Tirumala Laddu) తయారీకి నెయ్యిని సరఫరా చేసిన భోలేబాబా (Bhole Baba) కంపెనీకి వివిధ రసాయనాలను అజయ్ కుమార్ సరఫరా చేసినట్లు సిట్ తేల్చింది. 2020 నుంచి 2024 వరకు భోలేబాబా కంపెనీకి కోట్ల రూపాయల విలువైన రసాయనాలు సరఫరా చేసిన అజయ్ కుమార్ భారీగా ఆదాయం పొందినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అజయ్ కుమార్ సరఫరా చేసిన రసాయనాలతో నెయ్యి తయారు చేసిన భోలే బాబా కంపెనీ కల్తీ నెయ్యిని (Adulerated Ghee) ట్యాంకర్ల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిందని సిట్ తెలిపింది. అజయ్ కుమార్ మోన్ గ్రిసరాయిడ్స్, అసెటిక్ ఆసిడ్స్ వంటి రసాయనాలు సరఫరా చేసినట్లు సిట్ (SIT) విచారణలో తేలింది. లడ్డూలు తయారు చేసే నేతిలో 90శాతానికి పైగా పామాయిల్ వినియోగించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పామాయిల్ తో నెయ్యి తయారీకి మోన్ గ్రిసరాయిడ్స్, అసిటిక్ ఆసిడ్ వంటి రసాయనాలను అజయ్ సుగంధ్ వాడినట్లు అధికారులు నిర్ధారించారు. తిరుమల కల్తీ నెయ్యి కుట్రలో అజయ్ కుమార్ కు కూడా భాగస్వామ్యం ఉందని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. కల్తీ నెయ్యి కేసులో ఏ16గా ఉన్న అజయ్ సుగంధ్ ను అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో (ACB Court) హాజరుపరిచారు. కేసును విచారించిన ఏసీబీ కోర్టు అజయ్ కుమార్ కు నవంబరు 21 వరకు రిమాండ్ విధించింది.






