ఆదోని జిల్లా సాధనం కోసం బంద్

by Thanuru Gopichand |

ఎమ్మిగనూరులో స్వల్ప ఉద్రిక్తత.

ఆదోని జిల్లా సాధనం కోసం బంద్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆదోని (Adoni) కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా ఒక జేఏసీ (JAC) కూడా ఏర్పాటై గత కొంత కాలంగా పోరాటం చేస్తోంది. ఆదోని జిల్లా చేయడం వల్ల తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని.. ప్రజలకు మేలు జరుగుతుందని జేఏసీ చెబుతోంది. ఈ క్రమంలో నేడు బంద్ (Bandh) కు పిలుపునివ్వగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో భాగస్వాములవుతున్నారు. ఈ బంద్ కు వైసీపీతో పాటు బిజెపి, వామపక్ష పార్టీలు మద్ధతును ఇచ్చాయి. జేఏసీ నేతలు ఆర్టీసీ డిపో దగ్గర బస్సులను అడ్డుకొని బంద్ కు సహకరించాలని కోరారు. పాఠశాలలు, దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తుండగా ఎమ్మిగనూరులో స్వల్ప ఉద్రికత్త నెలకొన్నట్లు తెలుస్తోంది.

అయితే ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో జేఏసీ బంద్ ను పాటిస్తోంది. అక్కడక్కడ ధర్నాలు, రాస్తారోకోలను చేస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఆదోని ప్రత్యేక జిల్లా డిమాండుకు తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు.

ఈ విషయమై జేఏసీ నేతలు మాట్లాడుతూ ఆదోనిని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందన్నారు. ప్రత్యేక జిల్లా హోదాతోనే ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. పాలన ప్రజలకు చేరువవుతుందని, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అందుకోసం ఎంతటి పోరాటినికైనా తాము సిద్ధమని ప్రకటించారు.

Next Story