ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు.. దరఖాస్తులు ప్రారంభం

by velandi.Saikiran |

ఏపీలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. RGUKT ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు.. దరఖాస్తులు ప్రారంభం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఏపీలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. RGUKT ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలలో 4400 సీట్ల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. ఈ ఏడాది పదో తరగతి పాసైన వారు దీనికి అర్హులు. ఇక మే 30వ తేదీ వరకు RGUKT https://www.rgukt.in/, ఏపీ ఆన్లైన్ మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. జూన్ 12వ తేదీన లిస్టు విడుదల కానుంది. జులై ఒకటో తేదీ నుంచి క్లాసులు కూడా ప్రారంభిస్తారు.

Next Story