పవన్ కల్యాణ్ క్యాంపు ఆఫీసుపై డ్రోన్ కలకలం.. ASP రవికుమార్ క్లారిటీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-20 11:57:22  IST  )

గుంటూరు జిల్లా మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం(Pawan Kalyan Camp Office)పై రెండ్రోజుల క్రితం డ్రోన్(Drone) కలకలం రేపిన సంగతి తెలిసిందే.

పవన్ కల్యాణ్ క్యాంపు ఆఫీసుపై డ్రోన్ కలకలం.. ASP రవికుమార్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం(Pawan Kalyan Camp Office)పై రెండ్రోజుల క్రితం డ్రోన్(Drone) కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్(Additional SP Ravikumar) వివరణ ఇచ్చారు. డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంపై విహరించిన డ్రోన్ ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్‌(AP State FiberNet)కు చెందినదిగా గుర్తించినట్లు తెలిపారు. మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్, శానిటేషన్, రోడ్ల వంటి అంశాలపై పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్ ఎగురవేసినట్లు తెలిపారు.

ఆ ఒక్కరోజే కాదని.. గత మూడ్రోజులుగా డ్రోన్‌ను ఎగురవేసినట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ అధికారులతో చర్చించాకే నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. కాగా, ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంపై డ్రోన్‌ ఘటనపై జనసేన పార్టీ(Janasena Leaders) నేతలు డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. స్పందించిన ఉన్నతాధికారులు అసలు ఏం జరిగిందో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా పోలీసులను ఆదేశించారు. వెంటనే శాంతిభద్రతల అడిషనల్ ఎస్పీ రవికుమార్‌ రంగంలోకి దిగారు. నార్త్‌ డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి టౌన్‌ సీఐ వినోద్‌‌తో కలిసి అక్కడకు చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్‌‌తో సంప్రదింపులు జరిపి నిర్ధారణకు వచ్చారు.

Next Story