Amaravathi: ప్రజలు అంగీకరిస్తేనే.. అదనపు భూసేకరణ

by Thanuru Gopichand |

అమరావతి రాజధాని ప్రజలు అంకీకరిస్తేనే భూసేకరణ చేస్తామని, లేకపోతే ల్యాండ్​పూలింగ్​పై ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి పొంగూరి నారాయణ అన్నారు.

Amaravathi: ప్రజలు అంగీకరిస్తేనే.. అదనపు భూసేకరణ
X

రైతులు ఆందోళన చెందవద్దు

శంషాబాద్​ఎయిర్​పోర్టు కట్టపోతే పదిశాతం విమానాలు దిగేవి కాదు..

వందేళ్లను దృష్టిలో పెట్టుకున అమరావతి నిర్మాణం

మంత్రి నారాయణ

దిశ, డైనమిక్​ బ్యూరో: అమరావతి రాజధాని (Rajadhani) ప్రజలు అంకీకరిస్తేనే భూసేకరణ చేస్తామని, లేకపోతే ల్యాండ్​పూలింగ్​పై ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి పొంగూరి నారాయణ (minister narayana) అన్నారు. వచ్చే నెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. సభ ఏర్పాటు చేసే వేదికను మంత్రి నారాయణ, అధికారులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నామని మంత్రి నారాయణ చెప్పారు. హైదరాబాద్‌లో గతంలో ఒక ఎయిర్‌పోర్ట్ ఉండేదని అయినా శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఇప్పుడు రెండో ఎయిర్‌పోర్ట్ లేకపోతే పదిశాతం విమానాలు కూడా దిగేవి కావన్నారు. రానున్న 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు (Cm Chandrababu) అమరావతి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని తెలిపారు. మోదీ రాకకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రధాని పర్యటన సందర్భంగా ప్రజలు వచ్చేందుకు 8 రోడ్లను పోలీస్‌ అధికారులు గుర్తించారని.. ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ అన్నారు. ప్రధాని సభ కోసం వచ్చే వారు వాహనాలు పార్కింగ్ చేయడానికి మొత్తం 11 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. ప్రధాని కేవలం గంటన్నర మాత్రమే అమరావతి పర్యటన కోసం సమయం ఇచ్చారని తెలిపారు. ప్రధాని మోదీ భద్రత దృష్ట్యా పటిష్ట చర్యలు చేపడుతున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు

Next Story