పోలీస్ స్టేషన్‌కు శ్రీరెడ్డి.. కీలక కేసులో విచారణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-19 10:06:52  IST  )

నటి శ్రీరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

పోలీస్ స్టేషన్‌కు శ్రీరెడ్డి.. కీలక కేసులో విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: నటి శ్రీరెడ్డి(Actor SriReddy)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌(Pusapatirega Police Station)లో ఆమెపై కేసు నమోదు అయింది. దీంతో ఆమెను పూసపటి రేగకు తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh)పై శ్రీరెడ్డి ఆరోపణలు చేశారని స్థానిక కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా శ్రీరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు.

కాగా 2019లో ఏపీలో వైసీపీ(Ycp) అధికారంలోకి వచ్చింది. దీంతో ఆ పార్టీకి నటి శ్రీరెడ్డి మద్దతు తెలిపారు. వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతేకాకుండా టీడీపీ(Tdp), జనసేన(Janasena) నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై దారుణంగా వ్యాఖ్యలు చేశారు. అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలను అప్పట్లో రెండు పార్టీల నాయకులు వ్యతిరేకించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. కానీ పట్టించుకోలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ, జనసేన నాయకులు ఆయా పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు.

అయితే శ్రీరెడ్డి తనను క్షమించాలని కోరారు. ఇకపై రాజకీయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌కు శ్రీరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారు. తనను క్షమించాలని, ఇకపై నోరు జారనని మన్నించాలని కోరారు. అయితే కూటమి నేతలు, కార్యకర్తలు మాత్రం శ్రీరెడ్డిపై గుర్రుగానే ఉన్నారు. ఇందులో భాగంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమెను విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసులు విచారిస్తున్నారు.

Next Story