- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా అభిమాన హీరో మా కింగ్: మాజీ మంత్రి రోజా
భారతీయ సినీ పరిశ్రమలో తనదైన వైవిధ్యమైన పాత్రలతో, వైభవోపేతంగా 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న కింగ్ అక్కినేని నాగార్జునకు మాజీ మంత్రి, నటి రోజాహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: భారతీయ సినీ పరిశ్రమ(Indian Film Industry)లో తనదైన వైవిధ్యమైన పాత్రలతో, వైభవోపేతంగా 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)కు మాజీ మంత్రి, నటి రోజా(Former Minister and Actress Roja) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు(Birthday Wishes) తెలిపారు. నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె ట్వీట్ చేశారు.
నాగార్జున సినీ ప్రయాణం అద్భుతం
తన అభిమాన హీరో అయిన నాగార్జున సినీ ప్రయాణం అద్భుతమైనదని రోజా కొనియాడారు. సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్, నిరంతర కృషి, ఆయన అందించిన బ్లాక్‌బస్టర్ విజయాలు తరతరాల నటీనటులకు, ప్రేక్షకులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు.
ఎన్నేళ్లు గడిచినా..
పరిశ్రమలో ఎన్నేళ్లు గడిచినా, ఎన్ని తరాలు మారినా నాగార్జున ఎప్పటికీ 'ఎవర్ గ్రీన్ మన్మధుడు' అని రోజా అభివర్ణించారు. నాగార్జున ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని రోజా ఆకాంక్షించారు.






