- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటుడు పోసాని విడుదలకు బ్రేక్.. ఎందుకంటే?
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి లోకేష్(Minister Nara Lokesh), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan), వారి కుటుంబ సభ్యుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన పోసానికి నిన్న(మంగళవారం) కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రూ. 20 వేల పూచీకత్తు, ఇద్దరు జామీనుతో కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా(Kurnool District) జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్‌గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు రోజే నరసరావుపేట జిల్లా కోర్టు కూడా బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి నేడు(బుధవారం) విడుదల అవుతారని వార్తలొచ్చాయి. కానీ.. తాజాగా సీఐడీ పీటీ వారెంట్ దాఖలుతో ఆయన విడుదల అకస్మాత్తుగా నిలిచిపోయింది.
Read More..
YS Jagan: మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం పక్కా.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు






