Posani: పోసాని కృష్ణమురళికి రిమాండ్.. జైలుకు తరలింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-28 02:34:13  IST  )

నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు జడ్జి రిమాండ్ విధించారు...

Posani: పోసాని కృష్ణమురళికి రిమాండ్.. జైలుకు తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి రైల్వే కోడూరు కోర్టు జడ్జి(Railway Kodur Court Judge) రిమాండ్ విధించారు. కులాలు, సినీ ఫ్యాన్స్, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీసులు(Obulavaripalli Police).. సుదీర్ఘ విచారణ అనంతరం రైల్వే కోడూరు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే కోర్టులో గురువారం అర్ధరాత్రి 2:30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ఐదుగంటల పాటు మెజిస్ట్రేట్‌ ఇరుపక్షాల వాదనలు వినింది. శుక్రవారం ఉదయం 5:30 గంటలకు జడ్జి తీర్పు వెలువరించింది. మార్చి 13 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం పోసానిని రాజంపేట సబ్‌జైలుకు తరలించారు.

Next Story