- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను డాబర్‌మన్‌లా చూపిస్తున్నారు: ప్రభుత్వంపై నటుడు పోసాని పరోక్ష వ్యాఖ్యలు
తమిళనాడులో నటుడు విజయ్ సీఎం కావాలని నటుడు పోసాని కృష్ణమురళి ఆక్షించారు. విజయ్‌ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా చాలా హుందాగా వ్యవహరించారని ఆయన తెలిపారు....

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు(Tamilnadu)లో నటుడు విజయ్(Vijay) సీఎం కావాలని నటుడు పోసాని కృష్ణమురళి(Actor Posani Krishna Murali) ఆక్షించారు. విజయ్‌ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా చాలా హుందాగా వ్యవహరించారని ఆయన తెలిపారు. ఎప్పుడూ, ఎక్కడా ఒక్క మాట కూడా జారలేదన్నారు. అలాగే ఏపీ రాజకీయాలపైనా పోసాని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రోజూ ఏ తప్పూ చేయలేదన్నారు. ఒక్క రూపాయి కూడా మోసం చేయలేదని చెప్పారు. తాను జెంటిల్మన్‌ని డాబర్మన్‌లా చూపిస్తున్నారని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేసే పార్టీకి మద్దతు ఇచ్చేగాని, వైసీపీతో సహా ఏ పార్టీలోనూ చేరలేదన్నారు. తప్పును మాత్రమే చెప్పాను తప్పా..ఎక్కడ వ్యతిరేకించలేదన్నారు. తనను అన్యాయంగా ఎవరు ఏమన్నా సరే ఒప్పుకునేది లేదని చెప్పారు. పేదలకు సాయం చేసే మనిషిని, అకారణంగా తనను, తన ఫ్యామిలీని తిడితే సహించే వ్యక్తికి కాదని పోసాని కృష్ణమురళి హెచ్చరించారు.






