- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోసానికి తెలియకుండానే 14 కేసులు.. కోర్టులో పొన్నవోలు కీలక వ్యాఖ్యలు
నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు రిమాండ్ విధించింది...

దిశ, వెబ్ డెస్క్: నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు(Railway Kodur Court) రిమాండ్ విధించింది. పోసాని తరపున లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు. తనపై 14 కేసులు ఉన్నట్టు పోసానికే తెలియదని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. పోసాని తరపున రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ ఎదుట ఆయన వాదనలు వినిపించారు.
పోసానిపై లైఫ్ పనిష్మెంట్ సెక్షన్(Life Punishment Section) 111 పెట్టారని, అయితే ఈ సెక్షన్‌ను కోర్టు కొట్టివేసిందని పొన్నవోలు స్పష్టం చేశారు. ఐటీ యాక్ట్(IT Act) కూడా వర్తించదని కోర్టుకు చెప్పినట్లు ఆయన చెప్పారు. ఐదేళ్లలోపు శిక్షపడే సెక్షన్లకు రిమాండ్ విధించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోసానిని రిమాండ్‌కు పంపొద్దని కోరామని చెప్పారు. సుప్రీం తీర్పు ప్రకారం తాము ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించామని పేర్కొన్నారు. కానీ తమ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పొన్నవోలు ఆవేదన వ్యక్తం చేశారు.






