‘ఛీ.. ఛీ ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా’.. పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన నటుడు(వీడియో)

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-12 03:16:16  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు

‘ఛీ.. ఛీ ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా’.. పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన నటుడు(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అయితే, నిన్న(శుక్రవారం) హైదరాబాద్‌లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాష గురించి మాట్లాడారు. మాతృభాష అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అన్ని భాషల పై పట్టు సాధించాలని సూచించారు. మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్లు కాదు, మరింత బలపడటం అన్నారు. ఇంకొక భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదు.. కలిసి ప్రయాణం చేయడం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీ రాజ్య భాష అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్ స్పందించారు. ‘‘ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా ఛీ ఛీ #Justasking’’ అంటూ పవన్ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.

పవన్ కళ్యాణ్ హిందీ భాష గురించి.. ‘‘మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృ భాష ఇది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మన రాజ్య భాష హిందీ ఉందన్నారు. తెలుగు తమిళం, కన్నడ, మలయాళం, దేశంలోని ఇతరత్రా అన్ని భాషలు కావొచ్చు మన మాతృభాష మీద మనకి గౌరవం ఉంటుంది. నాకు మాతృభాష అంటే చాలా ఇష్టం. కానీ వృత్తిపరమైన లేదా జాతీయ పరిస్థితుల్లో, అది హిందీ. మనం ఆచరణాత్మకంగా ఉండాలని తెలిపారు. భాష బోనుగా మారకూడదు. అందుకే నేను హిందీ, ఇంగ్లీష్, తెలుగు - అవసరమైనది ఏదైనా మాట్లాడతాను. నేను తమిళనాడుకు వెళితే, తమిళం మాట్లాడటానికి ప్రయత్నిస్తాను’’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోను నటుడు ప్రకాష్ రాజ్ షేర్ చేస్తూ విమర్శించారు.ట్వీట్

Next Story