- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల్లో పోటీపై స్పందించిన నటుడు అలీ
ఎన్నికల్లో పోటీపై ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ అలీ స్పందించారు. రాజమండ్రిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో సోమవారం ఎంపీ మార్గాని భరత్‌తో కలిసి అలీ పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో పోటీపై ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ అలీ స్పందించారు. రాజమండ్రిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో సోమవారం ఎంపీ మార్గాని భరత్‌తో కలిసి అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం జరుగలేదని అన్నారు. ఈ వారంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చే చాన్స్ ఉందని చెప్పారు. రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు అని అన్నారు. ఎన్నికల వేళ పొత్తులు పెట్టుకోవడం కూడా సహజం అని చెప్పారు.
కానీ, అంతిమ విజయం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. కాగా, సినిమాల్లో మంచి పేరు సంపాదించిన అలీకి ప్రజాప్రతినిధి కావాలని గట్టి కోరిక ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. కానీ పోటీ చేసే ఛాన్స్ రాలేదు. ఈ సారి సీఎం జగన్ అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నారు. ఎంపీ సీటు కేటాయించే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. ఓ మైనార్టీకి చాన్సివ్వాలని అనుకుంటున్న జగన్.. అలీ పేరును పరిశీలనలోకి తీసుకుంటున్నారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.






