- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఫైర్
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నిర్వహిస్తున్న ఎస్వీ గోశాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) మరోసారి గోశాలను పరిశీలించారు.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నిర్వహిస్తున్న ఎస్వీ గోశాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) మరోసారి గోశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోవులకు వాడుతున్న దాన, గోవుల ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గోశాలపై వస్తున్న ఆరోపణల పట్ల ఫైర్ అయ్యారు. గోశాలపై గ్లోబెల్స్ ప్రచారం (Globals campaign)చేస్తున్నారని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదు అని స్పష్టం చేశారు.
కొందరు పిల్ వేస్తామంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారని, వైసీపీ నేతల(YCP Leaders) బెదిరింపులకు ఇక్కడెవరు భయపడరు అని చెప్పారు. పింక్ డైమండ్ (Pink diamond) పైన అనవసర రార్థాంతం చేశారని, పింక్ డైమండ్ పై ఓ పెద్దమనిషి పిల్ వేశారు.. అది ఇప్పటి వరకు ఏమైందో తెలియదని అన్నారు. ఇక ఐదేళ్లలో టీటీడీ నిధుల (TTD Funds) స్వాహాపై పిల్ వేయాల్సిన అవసరం ఉన్నదని, ఐదేళ్లలో తిరుమలలో అవకతవకలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. వైసీపీ హయాంలో గత ఐదేళ్ళలో గోవుల గడ్డిని కూడా తినేశారని, గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని అన్నారు.
గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి (Goshala Former Director Harinath Reddy) దుర్మార్గుడు అని, ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని, గోవులతో ఆడుకున్న వ్యక్తి హరినాథరెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోశాలలో రికార్డులన్నీ హరినాథరెడ్డి ఎత్తుకుపోయారని, ఆయన బాగోతం బయటపడుతుందని రికార్డులు ఎత్తుకెళ్ళాడని విమర్శలు చేశారు. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి (BJP Leader Subrahmanya Swamy)కి గత ఐదేళ్లలో గోశాలలో జరిగిన అన్యాయాలు కనిపించలేదా అంటూ... వైసీపీపై సుబ్రమణ్యస్వామి ఎందుకు పిల్ వేయలేదని ప్రశ్నించారు.
టీటీడీ అంటేనే ఒంటికాలిపై లేచే సుబ్రమణ్యస్వామి నిజానిజాలు ఏంటో తెలుసుకోరా? అని నిలదీశారు. గోశాలలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేస్తామని, గోశాలలో ఏం జరుగుతుందో కమిటీ తేలుస్తుందని అన్నారు. వైసీపీ చేసిన తప్పును మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఈ విషయాలను ఖచ్చితంగా సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతామని, టీటీడీ మాజీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని బీఆర్ నాయుడు వెల్లడించారు.






