TTD: తిరుమలలో మరో అపచారం.. ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం!

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-22 06:11:24  IST  )

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల(Tirumala)లో అపచారం చోటుచేసుకుంది.

TTD: తిరుమలలో మరో అపచారం.. ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం!
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల(Tirumala)లో అపచారం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో అన్యమత ఉద్యోగుల వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. టీటీడీలో మరో ఇద్దరు ఉద్యోగుల పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగుల వ్యవహరంపై టీటీడీకి ఫిర్యాదులు వచ్చాయి.

ఫిర్యాదులో.. ఒకరు మత ప్రచారకుడిగా, మరొకరు ప్రార్థనా మందిరంలో బైబిల్స్ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ‘‘టీటీడీ ఉద్యోగి శేఖర్ ఏకంగా మత ప్రభోదకుడిగా మారారు. మరో ఉద్యోగి కన్నిగ ప్రార్థనా మందిరంలో బైబిల్స్ పంపిణీ చేశారు’’ అని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరిపై అధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే.. గతంలోనూ తిరుమలలో అనేకమంది అన్యమత ఉద్యోగులపై టీటీడీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

Next Story