CRZ నిబంధనలు ఉల్లంఘన.. ఏపీలో రెండు బార్లు సీజ్

by Vemula.Srinu Prasad |

కొన్ని బార్లు, రెస్టారెంట్లు నిబంధనలు ఉల్లంఘించి మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. డిజిటల్ పేమెంట్లు, నగదు చెల్లింపులు చేస్తున్నపటికీ అవకతకలకు పాల్పడుతున్నారు...

CRZ నిబంధనలు ఉల్లంఘన.. ఏపీలో రెండు బార్లు సీజ్
X

దిశ, వెబ్ డెస్క్: కొన్ని బార్లు, రెస్టారెంట్లు నిబంధనలు ఉల్లంఘించి మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. డిజిటల్ పేమెంట్లు, నగదు చెల్లింపులు చేస్తున్నపటికీ అవకతకలకు పాల్పడుతున్నారు. అలాగే రికార్డులు మెయింటెనెన్స్ విషయంలోనూ యజమానులు అవకతవకలకు పాల్పడుతున్నారు. అటు సమయపాలన మించి మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారు. ఇక బిల్లులు విషయంలోనూ లెక్కలు సరిగా చూపకుండా రికార్డుల్లోనూ తేడాలు చూపిస్తున్నారు. ముఖ్యంగా జీఎస్టీ, పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు జులుం విదిల్చారు. విశాఖతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల ఐటీ అధికారులు దాడులు చేశారు. పలు రెస్టారెంట్లను సీజ్ చేశారు.

అయితే తాజాగా విశాఖ(Visakha)లో రెండు బార్లపై స్థానిక అధికారులు దాడులు చేశారు. హైకోర్టు ఆదేశాలతో సీజ్ చేశారు. సీఆర్‌జెడ్(CRZ) నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకున్నారు. కాపులుప్పలపాడులోని విరాగో, శాంక్టం బార్లను అధికారులు సీజ్ చేశారు. ఈ రెండు బార్లపై హైకోర్టులో కొందరు ఫిర్యాదులు చేశారు. దీంతో రెండు వర్గాలు వినిపించారు. అయితే అధికారులతో పాటు బార్ల యాజమాన్యంపై సరైన సమాధాలు రాలేదు. ఈ మేరకు విరాగో, శాంక్టం బార్లను సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఇక విరాగో, శాంక్టం బార్ల కట్టడాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు, అధికారులు గుర్తించారు. బేవాజ్ రెస్టారెంట్ లీజు తీసుకుని శాంక్టం బార్‌గా మార్చారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్‌కు సంబంధించిన నిబంధనలు పాటించకపోవడంతో విరాగో, శాంక్టం బార్‌ను సీజ్ చేశారు. నిబంధనలు తుంగలో తొక్కి నిర్మాణాలు చేపట్టిన మరో మూడు బార్లపై కేసులు నమోదు అయ్యాయి.

Next Story