- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యాధికారులపై చర్యలు
లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు.

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లాలోని గుడివాడ ప్రభుత్వాస్పత్రిలో (Gudivada Government Hopistal) జరిగిన అవినీతి (Corruption), నిధుల దుర్వినియోగంపై (Misuse Of Funds) రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కఠిన చర్యలను చేపట్టింది. ఆసుపత్రి నిర్వహణలో నిధుల మళ్ళింపు, మందుల కొనుగోలులో అక్రమాలు, ఇతర పరిపాలనాపరమైన లోపాలపై అధికారులు ఇటీవల విచారణ జరిపారు. విచారణ అనంతరం అవినీతికి బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలను చేపట్టారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు మరో 10 మంది వైద్య సిబ్బందికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గత కొంతకాలంగా ఆసుపత్రిలో జరుగుతున్న పరిణామాలపై అందిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ (ACB) నివేదిక, అంతర్గత ఆడిట్ ఆధారంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నోటీసులు అందుకున్న సూపరింటెండెంట్, ఇతర వైద్య అధికారులు 10 రోజుల్లోగా విచారణాధికారి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. తమపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పూర్తిస్థాయి లిఖితపూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశించింది. ఆడిట్ నివేదికలను పట్టించుకోకపోవడం, రోగులకు సరైన సేవలు అందించడంలో విఫలం కావడం, ఆస్పత్రి వాహనాల దుర్వినియోగం వంటి అంశాలు ఈ విచారణలో ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నిర్ణీత గడువులోగా సరైన సమాధానం ఇవ్వని పక్షంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.






