General Election 2024 : పొత్తు అధికారం కోసం కాదు.. దానికోసమే..!?

by Indraja |   (  Updated:2024-03-16 15:14:50  IST  )

ఈ నేపథ్యంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

General Election 2024 : పొత్తు అధికారం కోసం కాదు.. దానికోసమే..!?
X

దిశ వెబ్ డెస్క్: రేపు చిలకలూరిపేటలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నిర్వహించనున్న ప్రజాగళం భహిరంగ సభకు నేడు మూడు పార్టీల నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చాలాసార్లు పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశామని.. కానీ ఇప్పడు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకున్నది అంటే అది అదిఆకారం కోసం కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసమని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఈ సంవత్సరాల్లో రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాబిన్నం చేసిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని మండిపడ్డారు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చెయ్యాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని అన్నారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల కోరిక మేరకే తాము పొత్తుపెట్టుకున్నట్లు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించేలా ఈ సభ జరగబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

ఇటువంటి సభ ఇప్పటివరకు జరగలేదని, ఇకపై జరగదని భావిస్తున్నామన్నారు. ఇక ఈ సభలో లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారు అని తెలిపారు. ఇక ఈ సభకు విచ్చేస్తున్న మోడీ ఆంధ్రకు అన్యాయం చేసిన జగన్ పై స్పష్టమైన సందేశాన్ని ప్రజలు ఇస్తారని తెలిపారు.

Read More..

విశాఖ ఉక్కును ఒక్క ఇంచు కూడా కదిలించలేరు: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

Next Story