విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

by Seetharam |
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదానికి భద్రతా చర్యలు లేకపోవడమే కారణం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికులు, మత్య్సకారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముందన్నారు. విశాఖలోని పలు పరిశ్రమల్లో ఇది వరకే ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి..వాటిని చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రిషికొండ ప్యాలెస్ నిర్మాణంపైనున్న శ్రద్ధ ప్రజల భద్రతపై పెట్టాలని సూచించారు. అగ్ని ప్రమాదంలో 40కి పైగా బోట్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది..బోట్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే కొత్త బోట్లు అందజేయాలి అని డిమాండ్ చేశారు. మరోమారు అగ్నిప్రమాదాలకు తావులేకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story