- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడికి రిమాండ్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో (Satyavardhan Kidnap Case) ఏ-2 నిందితుడిగా ఉన్న కొమ్మా కోటేశ్వర రావు ఆలియాస్ కొమ్మా కోట్లకు ఎస్సీ, ఎస్టీ కోర్టు రిమాండ్ (SC ST Court) విధించింది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో (Satyavardhan Kidnap Case) ఏ-2 నిందితుడిగా ఉన్న కొమ్మా కోటేశ్వర రావు ఆలియాస్ కొమ్మా కోట్లకు ఎస్సీ, ఎస్టీ కోర్టు రిమాండ్ (SC ST Court) విధించింది. నిందితుడిని నెల్లూరు జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే కొమ్మా కోట్ల గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కోట్ల ఆచూకీపై పక్కా సమాచారం అందుకున్న పటమట పోలీసులు, ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపును చేపట్టారు. సత్యవర్ధన్‌ను బెదిరించి, కిడ్నాప్ చేసిన వ్యవహారంతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో కూడా కోట్ల నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు కీలక కేసుల్లో అతని పాత్రపై లోతుగా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కొమ్మా కోట్ల విజయవాడ పటమట పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయన్ను కోర్టు ముందు హాజరు పరిచిన పోలీసులు రిమాండుకు తరలిస్తున్నారు.
కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్థన్ కిడ్నాప్ చేసి హైదరాబాద్ కు తరలించాడనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా అక్కడ నుంచి విజయవాడకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అయితే కేసును ఉపసంహరించుకోవాలని సత్యవర్థన్ పై వల్లభనేని వంశీ అనుచరులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని.. అందులో భాగంగానే కిడ్నాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కేసులో కీలక నిందితుడైన ఎర్రంశెట్టి రామాంజనేయులును పటమట పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నిందితులు తేలప్రోలు రాము, వజ్రకుమార్ ఇటీవలే కోర్టులో లొంగిపోయిన విషయం విదితమే. కేసులో వల్లభనేని వంశీ ఏ1గా, కొమ్మా కోట్లు ఏ2గా ఉన్నారు.






