- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో నిందితుడు అరెస్ట్.. రిమాండ్
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు..

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి(Rajahmundry)లో కల్తీ పాలు(Adulterated Milk) తాగి ఐదుగురు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుడు గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో గణేష్‌కు ధర్మాసనం 14 రోజల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
కల్తీ పాలు తాగి...
కాగా రాజమండ్రిలోని రెండు కాలనీల్లో కల్తీ పాలు తాగి తొలుత నలుగురు మృతి చెందగా.. తాజాగా బాలుడు మృతి చెందారు. విశాఖ(Visakhapatnam)లో చికిత్స పొందుతూ మరణించారు. మొత్తం ఈ ఘటనలో 16 మంది బాధితులు కాగా.. గత పదేళ్ల నుంచి ఒకే వ్యక్తి పాలు పోయించుకున్నట్లు తేలింది. అయితే ఇటీవల పాలు రుచి తేడాగా ఉండటంతో వాంతులు అయ్యాయి. అదే రోజు మొత్తం 110 కుటుంబాలకు పాలు పోశారు. మొత్తం 315 మంది రక్తనమూనాలను అధికారులు సేకరించి ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుం ఇందుకు కారణమైన నిందితుడు గణేష్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు






