- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలను మోసం చేసిన నిందితుడు అరెస్ట్
మ్యాట్రిమోనీ సైట్ లు వేదికగా మోసాలు.. భార్య హత్య కేసులో నిందితుడిగా గుర్తింపు.

దిశ, వెబ్ డెస్క్ : షాదీ డాట్ కామ్.. తెలుగు మాట్రిమోనీ (Matrimony) వంటి వివాహ వేదికల ద్వారా అమాయక మహిళలను (Innocent Women) లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న చిత్తూరు (Chittoor) జిల్లాకు చెందిన చల్లా నారాయణ (Challa Narayana) అలియాస్ కృష్ణను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా రంగంలోకి దిగిన పోలీసు బృందం (Police Team) అతడిని చాకచక్యంగా పట్టుకుంది. నిందితుడి వద్ద నుంచి సుమారు 340 గ్రాముల బంగారం, రెండు ఖరీదైన కార్లు, పలు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు చిత్తూరుతో పాటు బెంగళూరు నగరంలోనూ అనేక దారుణాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. కేవలం ఆర్థిక మోసాలే కాకుండా తన భార్యను హత్య చేసిన కేసులో కూడా చల్లా నారాయణ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి పేరుతో నమ్మించి మహిళలను ఆర్థికంగా, మానసికంగా వేధిస్తున్న ఇటువంటి నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్‌కు తరలించి, ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.






