విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో వివాహితపై రేప్.. ఏసీ కోచ్ మెయింటెనెన్స్ బాయ్ అరెస్ట్

by Vemula.Srinu Prasad |

విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో వివాహితపై అత్యాచారం జరిగిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు నిందితుడిని రైల్వే పోలీసులు గుర్తించారు. ..

విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో వివాహితపై రేప్.. ఏసీ కోచ్ మెయింటెనెన్స్ బాయ్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు(Visakhapatnam Express Train)లో వివాహిత(Married Woman)పై అత్యాచారం(Rape) జరిగిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు నిందితుడిని రైల్వే పోలీసులు గుర్తించారు. ఏసీ కోచ్ మెయింటెనెన్స్ బాయ్ సౌరవ్ బగ్డిని అరెస్ట్ చేశారు. నిందితుడు సౌరవ్ బగ్డి విజయవాడ రైల్వే కాంట్రాక్ట్ సంస్థ లియోటెక్ ప్రాసెస్‌కు చెందినగా ఉద్యోగిగా రైల్వే పోలీసులు ధృవీకరించారు.

ఏసీ కోచ్‌లో కూర్చోవాలి..

కాగా విశాఖ ఎక్స్ ప్రెస్‌లోని ఏసీ కోచ్ మెయింటెనెన్స్ బాయ్‌గా పని చేస్తున్న సౌరవ్.. ఒడిశాకు చెందిన వివాహితపై కన్నేశాడు. ఏసీ కోచ్‌లో కూర్చోవాలని పిలిచారు. అయితే సౌరవ్ పన్నాగాన్ని గుర్తించని వివాహ ఏసీ కోచ్‌లోకి వెళ్లి కూర్చున్నారు. మిగిలిన ప్రయాణికులెవరూ లేకపోవడంతో అదునుగా భావించిన సౌరవ.. ఆమెపై బలత్కారానికి పాల్పడ్డారు. దీంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Next Story