- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికపై అత్యాచారం కేసులో నిందితుల అరెస్ట్
సత్తెనపల్లిలోని ఓ లాడ్జిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘోరమైన ఘటన విదితమే. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : సత్తెనపల్లిలోని ఓ లాడ్జిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘోరమైన ఘటన విదితమే. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ కు చెందిన బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇటీవలే వారి కుటుంబం మంగళగిరికి వలసపోయింది. దీంతో బాలిక తమ పెద్దమ్మ ఇంట్లోనే ఉంటోంది. కొద్ది నెలల క్రితం బాలికకు పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన చిలుకూరు రాహుల్ అనే వ్యక్తితో ఇన్‌స్టాలో పరిచయమైంది. రాహుల్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. హైదరాబాద్‌లో ఉంటున్న స్నేహితుడు ఆనంద్ కుమార్ సిరిగిడి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఓ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నాడు. సత్తెనపల్లి వచ్చిన తర్వాత కారు నంబరును మార్చేశాడు. టీఎస్09 ఈటీపై ఏకేఎస్ (ఆనంద్ కుమార్ సిరిగిడి) అని స్టిక్కర్ అతికించాడు. ఈనెల 18న రాహుల్, ఆనంద్‌తోపాటు పాత గుంటూరుకు చెందిన ప్రదీప్, భరత్, బాబీ అనే ముగ్గురు యువకులు కారులో విజయవాడ వెళ్లారు. ఈ ఐదుగురు కలిసి విజయవాడలో వారధి వద్దకు వచ్చారు. కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న బాలికను రాహుల్ వారధి వద్దకు రప్పించాడు. బాధితురాలు తమ ఇంటి వద్ద ఉండే ఇద్దరు స్నేహితురాళ్లతో షాపింగ్‌కు వెళ్దామని చెప్పి బయటకు వచ్చింది.
వారు స్కూటర్‌పై బయలుదేరిన తర్వాత తనను వారధి వద్ద వదిలిపెట్టమని వారికి సూచించింది. ఆమెను వారు అక్కడ దింపి వెళ్లిపోయారు. తర్వాత రాహుల్ కారులో ఆమెను ఎక్కించుకుని సత్తెనపల్లి తీసుకెళ్లి.. అక్కడ లాడ్జిలో రెండు గదులను అద్దెకు తీసుకొన్నారు. ఒక దానిలో బాలికను పెట్టి, మరో గదిలో స్నేహితులను ఉంచాడు. ఆ తరువాత బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. చీకటి పడినా బాలిక తిరిగి రాకపోవడంతో పెద్దమ్మ, పెదనాన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం అంతటా వెతికారు. ఈ క్రమంలో బాలక శనివారం రాత్రి సత్తెనపల్లిలో ఉన్నట్టు స్నేహితురాలికి ఓ సందేశం పంపింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే లాడ్జి వద్దకు వెళ్లి బాలికను గుర్తించారు. రాహుల్‌తోపాటు ప్రదీప్, భరత్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఆనంద్, బాబీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






