- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడ్వకేట్ దారుణ హత్య... 48 గంటల్లోనే నిందితుల అరెస్ట్
నరసరావుపేట: చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ సమీపంలో జరిగిన అడ్వకేట్ శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసును చిలకలూరిపేట రూరల్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు....

దిశ ప్రతినిధి. నరసరావుపేట: చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ సమీపంలో జరిగిన అడ్వకేట్ శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసును చిలకలూరిపేట రూరల్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఉసర్తి వెంకట కోటయ్య, కొండారెడ్డి శ్రీనివాసరావులను పోలీసులు అరెస్ట్ చేసి ఇనుప రాడ్డు, బైక్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మృతుడు హరిప్రసాద్ మార్కాపురం బార్ అసోసియేషన్‌లో అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. నిందితుడైన కోటయ్యకు, హరిప్రసాద్ భార్య నాగజ్యోతికి మధ్య ఉన్న అక్రమ సంబంధమే ఈ ఘాతుకానికి దారితీసింది. తన భర్త వేధిస్తున్నాడని నాగజ్యోతి చెప్పడంతో, అతడిని అడ్డు తొలగించుకోవాలని కోటయ్య పథకం వేశాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు శ్రీనివాసరావు సహాయంతో హరిప్రసాద్‌ను నరసరావుపేటకు పిలిపించి, మద్యం సేవించిన అనంతరం యడవల్లి వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ఇనుప రాడ్డుతో తలపై కొట్టి అతి దారుణంగా చంపారు. ఆపై ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహంపై స్కూటీని నెట్టి నిందితులు పరారయ్యారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.






