ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం

by Thanuru Gopichand |

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి, చింతూరు వద్ద ఆర్టీసీ బస్సుకు (RTC Bus Accident) తృటిలో ప్రమాదం తప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి, చింతూరు వద్ద ఆర్టీసీ బస్సుకు (RTC Bus Accident) తృటిలో ప్రమాదం తప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం వేళ ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గోకవరం డిపోకు చెందిన ఎక్స్ ప్రెస్ సర్వీసు రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరింది. మారేడుమిల్లి (Maredumilli), చింతూరు దుర్గమ్మ గుడి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోగా కల్వర్టును బస్సు ఢీకొట్టింది. అయితే ప్రమాదం అనంతరం కల్వర్టు వద్దనే నిలిచిపోవడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సమయంలో సుమారు 60 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలే బస్సు లోయలో పడిన ఘటనలో తొమ్మిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం జరిగి ఉంటే అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం అనంతరం బస్సు ముందు భాగం దెబ్బతినడంతో డ్రైవరు చాకచక్యంగా తులసిపాకు చేర్చారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో అక్కడి నుంచి వెళ్లారు.

Next Story